హ్యూమన్ బీయింగ్ గా గుర్తించుకోవాలనుకుంటా
‘మమతల తల్లీ.. ఒడి బాహుబలీ
లాలనతేలీ.. శతధావరలీ
ఎదలో ఒక పాలకడలి.. మధనం జరిగే స్థలీ..’
పాడిన గొంతే… కొంటెగా.. ‘సోగ్గాడే.. చిన్నినాయినా.. ఒక్కపిట్టనైన కొట్టలేదే సోగ్గాడూ..’ అంటూ దుమ్మి రేపిందంటే నమ్ముబుద్ది కాదు. ఆమే సత్య యామిని. మమతలతల్లీ పాట..శివగామి అనే పాత్రలోని స్వభావాన్ని, గాఢతను ప్రకటించింది. ఈ పాటలోని ఎమోషన్ జనాలను కట్టిపారేసింది. ఆ చిన్నిగొంతులో చక్కగా పలకడంవల్లనే.. పాట అంత హిట్టయ్యింది. చిన్నతనం నుంచీ పాటే ప్రాణంగా బతికినందుకు ఆమెకు దక్కిన అపురూప బహుమతి అది. ‘బాహుబలి’ తో లభించిన గుర్తింపుతో పలు సినిమాల్లో.. ప్లేబ్యాక్ సింగర్‌గా, మరో ప్రక్క స్టేజ్ షోలతోనూ ఫుల్ బిజీ అయ్యిపోయింది.
అతి చిన్న వయస్సులోనే తనకంటూ అభిమానులను, క్రేజ్ ని సంపాదించుకుని ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న గాన కోయిల సత్యయామినితో ఉగాది పూట తెలుగు 100 చిట్ చాట్ మీకోసం..
- పాడిన పాటలో ఇష్టమైనవి ఏవి
- లిరిక్ ని ట్యూన్ డామినేట్ చేసేస్తోంది. పాటలో సాహిత్యం వినపడలేదని చాలా కాలంగా కంప్లైంట్ ఉంది, మీరేమంటారు